TSRTC Samme : ఆర్టీసీ కార్మిక సంఘాలతో విఫలమైన చర్చలు || Oneindia Telugu

2019-10-03 440

Ahead of Dasara, trade unions of the Telangana State Road Transport and the State government have locked horns. With both refusing to budge, the fate of tens of thousands of passengers who have scheduled their travel this festival season hangs in balance.
#tsrtcsamme
#iaspanel
#tsrtctaffDemands
#telanganacmkcr
#someshkumar
#tsrtcmdsunilsharma
#dasarafestival
#tsrtcjac

ఆర్టీసీ సమ్మెను తప్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఎస్‌ అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ, ఆర్టీసీ కార్మిక సంఘాల మధ్య బుధవారం జరిగిన తొలిదశ చర్చలు విఫలమయ్యాయి. సమ్మెకు సిద్ధమైన కార్మిక సంఘాలు ప్రభుత్వం ముందుంచిన 26 డిమాండ్లలో ఏ ఒక్కదానికి కూడా కమిటీ నుంచి నిర్దిష్ట హామీ రాకపోవటం, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కండక్టర్, డ్రైవర్ల ఉద్యోగ భద్రతకు సంబంధించిన ప్రతిపాదన లాంటి కీలక అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందీలేనిదీ చెప్పకపోవటం, అసలు ప్రభుత్వానికి ఈ కమిటీ నివేదిక ఎప్పట్లోగా ఇస్తుందో కాల పరిమితి వెల్లడించకపోవటంపై కార్మిక సంఘాలు ప్రశ్నించాయి. ఇలాంటివేమీ లేకుండా సమ్మె ఆలోచన విరమించుకోవాలని చెప్పడాన్ని తప్పు పడుతూ, సమ్మె విషయంలో తమ ఆలోచన మారదని పేర్కొన్నాయి. దీంతో ఈ చర్చలు విఫలమైనట్లు స్పష్టమవుతోంది. దీంతో గురువారం మధ్యాహ్నం మరోసారి చర్చలకు రావాల్సిందిగా కార్మిక సంఘాలకు సూచించాయి. ఆ చర్చలకు తాము హాజరవుతామని, అందులో కొన్ని డిమాండ్లకైనా హామీ రావటంతో పాటు ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వానికి నివేదిక ఎప్పట్లోగా ఇస్తారు.. వాటిపై ప్రభుత్వం ఎప్పట్లోగా స్పష్టత ఇస్తుందో వెల్లడిస్తే సమ్మె విరమణకు సిద్ధమని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి.